![]() |
![]() |

జ్యోతి రాయ్ అంటే ఇప్పుడిప్పుడే కొంతమందికి తెలుస్తోంది ఆమె హాట్ పిక్స్ ద్వారా..కానీ గుప్పెడంత మనసు జగతి మేడం అంటే అందరికీ బాగా తెలుస్తుంది. అలాంటి జ్యోతి ఇప్పుడు రీసెంట్ గా ఒక పోలీస్ డ్రెస్ లో ఉన్న పిక్ ని పోస్ట్ చేసింది. ఆ లుక్ ఫుల్ గా వైరల్ అవుతోంది. "అండర్ వరల్డ్ బిలియనీర్స్" పేరుతో ఒక వెబ్ సిరీస్ సిరీస్ చేసింది జగతి మేడం. యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కథా కథనంతో రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో చేస్తుండగా రాధిక - ప్రీతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధుసూధన్ ,జ్యోతి రాయ్ ,షవర్ అలీ,అలోక్ జైన్, లీనా కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీ సెట్స్ మీదకు రాబోతోంది అంటూ తన పిక్ కి టాగ్ పెట్టింది జగతి. ఇక ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "ప్రెట్టిగర్ల్ మూవీని చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తే పోలీస్ గర్ల్ వచ్చిందేమిటి, జ్యోతి రాయ్ ఎలాంటి డ్రెస్ లో ఉన్నా హాట్ గానే ఉంటుంది, సో హాట్, ప్రెట్టి, బ్యూటిఫుల్, డియర్ ఏసీపీ సమర్ధన ప్లీజ్ నన్ను జైలులో పెట్టవా" అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ నార్కోటిక్ ఏసీపీ సమర్ధనగా నటిస్తోంది. ఇక ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. కన్నడ పరిశ్రమ నుంచి వెబ్ సిరీస్ లు, సినిమాలు చేస్తోంది జ్యోతీరాయ్. వీటన్నిటి కారణంగా గుప్పెడంత మనసు సీరియల్ లో అర్దాంతరంగా ఆమె పాత్రను చంపేశారు. అలా ఆ రోల్ చచ్చిపోయిందో లేదో జ్యోతి సోషల్ మీడియాలో పట్టపగ్గాలు లేకుండా అందాలు ఆరబోస్తోంది. స్లిమ్ బాడీని మెయింటేన్ చేస్తూ..బ్యూటిఫుల్ లుక్స్ తో అదరగొడుతోంది జ్యోతి.
![]() |
![]() |